గాంధీ జయంతి సందర్భంగా బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళులర్పించారు. గౌరవ అధ్యక్షులు మరడ రామనాయుడు ఆధ్వర్యంలో, అధ్యక్షులు రేవళ్ళ కిరణ్‌కుమార్ పర్యవేక్షణలో సభ్యులు బొబ్బిలిలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ“వ్యక్తి మారితే సమాజం మారుతుంది. సమాజం మారితే దేశం మారుతుంది. గాంధీజీ ఆలోచనలు తరాలుమారినా తరగని స్ఫూర్తిగా నిలుస్తాయని కొనియాడారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలను ప్రతిఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భోగేశ్వరరావు, పి. ఎన్. రావు, సీహెచ్. మోహన్‌రావు, ఎస్. ఆర్. మోహన్‌రావు, వి. ఎన్. శర్మ, ఏ. గోవిందనాయుడు పాల్గొన్నారు.