బొబ్బిలికి రూ. 46.89 కోట్ల జల్‌జీవన్ మిషన్ నిధులు
By srinu 591చూసినవారుబొబ్బిలి కోటలో ఎమ్మెల్యే ఆర్. వీ. ఎస్. కె. కె. రంగారావు (బేబీనాయన) ఆర్‌డబ్ల్యూఎస్, ప్రాజెక్ట్స్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జల్‌జీవన్ మిషన్ కింద బొబ్బిలి నియోజకవర్గానికి రూ. 46. 89 కోట్లు, గ్రామీణ రహదారుల అభివృద్ధికి ఎస్‌ఏఎస్‌సీఐ ద్వారా రూ. 10. 21 కోట్లు మంజూరైనట్లు అధికారులు వివరించారు. జల్‌జీవన్ నిధుల్లో బొబ్బిలికి రూ. 16. 52 కోట్లు, తెర్లాంకు రూ. 11. 21 కోట్లు, బాడంగికి రూ. 9. 76 కోట్లు, రామభద్రపురానికి రూ. 9. 38 కోట్లు కేటాయించారు.