బొబ్బిలి: ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో

82చూసినవారు
బొబ్బిలి: ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో
బొబ్బిలి మండలంలోని అలజంగి గ్రామం సీతారామ చెరువులో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీవో పి. రవికుమార్ బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన ఉపాధి కూలీలతో మాట్లాడుతూ కొలతల ప్రకారంగా పనులు నిర్వహించాలని, కూలీలకు నష్టం జరగకుండా హాజరులు సక్రమంగా వేయాలని కోరారు. పని జరిగే చోట మౌలిక సౌకర్యాలు కల్పించాలని, పని వేళలు పాటించేలా చూడాలని ఉపాధి సిబ్బందికి ఆదేశించారు.

సంబంధిత పోస్ట్