బొబ్బిలి పట్టణంలోని బలిజిపేట రోడ్డులో ఉన్న వైశ్యరాజు జువెలరీ వద్ద మంచినీటి కుళాయి పగిలి నీరు వృధాగా పోతోంది. ఈ విషయంపై స్థానికులు వార్డు సచివాలయ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. నీరు వృధాగా పోవడం వల్ల ఆ ప్రాంతం బురదమయంగా మారి ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని, అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.