ఏపీఐఐసీ కార్మికుల సమస్యలపై ఎమ్మెల్యేకు సీఐటీయూ వినతి

3చూసినవారు
ఏపీఐఐసీ కార్మికుల సమస్యలపై ఎమ్మెల్యేకు సీఐటీయూ వినతి
విజయనగరం, బొబ్బిలి కోటలో జరిగిన గ్రీవెన్స్‌లో గ్రోత్‌ సెంటర్‌ ఏపీఐఐసీ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న 9 మంది కార్మికుల సమస్యలపై సీఐటీయూ నాయకులు ఎమ్మెల్యే బేబీనాయనకు వినతిపత్రం శనివారం  అందించారు. కాంట్రాక్టర్‌ కనీస వేతనాలు అమలు చేయడం లేదని, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సొమ్ము సక్రమంగా జమ కావడం లేదని తెలిపారు. తమ సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చినా పరిష్కారం కాలేదని పేర్కొంటూ ఎమ్మెల్యే జోక్యం చేసుకుని కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జోగినాయుడు, ధనంజయ్, జగదీష్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పి. శంకర్రావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్