విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం రాజుపేట గ్రామంలో గురువారం
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే ఆర్. వీ. ఎస్. కే. కే. రంగారావు (బేబీనాయన), బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు,
టీడీపీ నాయకులు, సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో
జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ గిరడ అప్పలస్వామి,
టీడీపీ నాయకులు అల్లాడ భాస్కర్రావు, వాసిరెడ్డి సత్యనారాయణ, వెన్నెల నాగరాజు, నాగిరెడ్డి రామారావు తదితరులు పాల్గొన్నారు.