అంగన్వాడీ కేంద్రాల్లో ఉత్సవాలు ప్రారంభం

0చూసినవారు
అంగన్వాడీ కేంద్రాల్లో ఉత్సవాలు ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ సందర్భంగా సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా మహిళా శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాజెక్టు పరిధిలోని 67 అంగన్వాడీ కేంద్రాల్లో సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పోషణ, మాతృ సంరక్షణ, టీకాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించడమే ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశ్యం. చింతాడలో సీడీపీఓ జె. విజయలక్ష్మి, సూపర్‌వైజర్ రాజు, పారాది, కారాడ, సిరిపురం కేంద్రాల్లో సూపర్‌వైజర్లు కె. శుభలక్ష్మి, ఎన్. ప్రభావతి, రామాకుమారి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్