గురజాడ తెలుగుకు వెలుగు జాడ

0చూసినవారు
గురజాడ తెలుగుకు వెలుగు జాడ
మహాకవి గురజాడ అప్పారావు తెలుగు భాషకు వెలుగు జాడ అని నాయుడువలస పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ జె. సి. రాజు అన్నారు. గురజాడ జయంతిని పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు శనివారం 6, 7, 8 తరగతుల విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. గురజాడ జీవితం, రచనలపై వ్యాసరచన చేపట్టారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు హెచ్‌ఎం, ఉపాధ్యాయులు కృష్ణంనాయుడు, ఉదయకుమారి బహుమతులు అందించారు. కన్యాశుల్కం, “దేశమంటే మట్టికాదోయ్” రచనల విశిష్టతను హెచ్‌ఎం వివరించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్