తాండ్రపాపరాయ పాఠశాలలో గురజాడ జయంతి

0చూసినవారు
తాండ్రపాపరాయ పాఠశాలలో గురజాడ జయంతి
బొబ్బిలి మండలం తాండ్రపాపరాయ పాఠశాలలో గురజాడ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో జరిగిన గురజాడ జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథి కిలపర్తి దాలినాయుడు గురజాడ రచనలపై ప్రసంగించారు. ఈ సభకు కవి మీసాల చినగౌరినాయుడు అధ్యక్షత వహించారు. తదనంతరం వేదిక కన్వీనర్ కె. విజయగౌరి, సాహితీకారులు, ఉపాధ్యాయులు దాలినాయుడు, గౌరినాయుడులను వారి సాహితీ కృషిని అభినందిస్తూ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ బెల్ట్ రమణమూర్తి, అప్పలనాయుడు, ప్రసన్నకుమార్, సత్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్