బొబ్బిలిలో జిల్లా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు వేమిరెడ్డి లక్ష్యం నాయుడు, వజ్జి రవికుమార్, రాంబార్కి తిరుపతిరావుతో పాటు కార్యవర్గ సభ్యులు ప్రభుత్వ విధానాలపై ఆదివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఏ పంటకు కూడా కనీస గిట్టుబాటు ధర లభించడం లేదని, వరి, మొక్కజొన్న, ఉల్లి, టమాటా వంటి పంటలకు ధరలు లేక రైతులు అప్పుల పాలవుతున్నారని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ప్రభుత్వాలు, రైతు రుణమాఫీకి మాత్రం చేతులు రావడం లేదని విమర్శించారు.