కోమటి పల్లిలో టిటిడి ఆధ్వర్యంలో ప్రవచన కార్యక్రమం

704చూసినవారు
కోమటి పల్లిలో టిటిడి ఆధ్వర్యంలో ప్రవచన కార్యక్రమం
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ విజయనగరం జిల్లా ప్రోగ్రాం కో ఆర్డినేటర్ శ్యామ్ కుమార్ ఆదేశాలు మేరకు బుధవారం బొబ్బిలి మండలం కోమటి పల్లి గ్రామ మెయిన్ రోడ్డు రామ మందిరం వద్ద ప్రముఖ పురాణం పండితులు బోధనపల్లి గౌరి నృసింహ ప్రసాద్ శర్మ ప్రవచనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరాముడు జీవిత చరిత్ర, దశావతారాలు గురించి సవివరంగా వివరించారు. ప్రవచనం అనంతరం భక్తులతో గోవింద నామ స్మరణ చేయించారు.

సంబంధిత పోస్ట్