కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు బొబ్బిలి నుండి ప్రయాణం

1041చూసినవారు
సామాన్య ప్రయాణికుల కోసం రైల్వేశాఖ తక్కువ ఖర్చుతో, వేగంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించే అమృత్ భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. తాజాగా ఒడిశా నుంచి గుజరాత్‌కు ఏపీ మీదుగా నడిచే కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో శనివారం బొబ్బిలి రైల్వే స్టేషన్‌లో పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర, బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ రాంబార్కి శరత్ బాబు, రైల్వే ఉన్నత అధికారులు పచ్చ జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్