బొబ్బిలి మండలం పెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ప్రధానోపాధ్యాయులు ముట్నూరు వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆంగ్ల భాష స్పెల్లింగ్ పోటీలు నిర్వహించారు. 6 నుంచి 10వ తరగతికి చెందిన 230 మంది విద్యార్థులకు డెల్టా అధ్యక్షుడు ఎం. విజయమోహన్‌రావు రూపొందించిన 500 అకాడమిక్ ఇంగ్లీష్ పదాలపై మూడు స్థాయిల్లో పోటీలు నిర్వహించారు. మండల విద్యాశాఖాధికారి కే. రమేష్‌కుమార్ పరిశీలించారు. ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో ఆంగ్ల పదజాలం, ఉచ్చారణ, మాట్లాడే నైపుణ్యాలను పెంపొందిస్తాయని తెలిపారు. విజేతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు.