గుర్ల పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ మద్దిల మురళి రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్ఠాత్మక డీజీపీ డిస్క్ అవార్డుకు ఎంపికయ్యారు. విజయనగరం, చీపురుపల్లి సర్కిల్ పరిధిలో సైబర్ కేసు ఛేదనలో ఆయన చూపిన ప్రతిభకు గుర్తింపుగా, జిల్లా ఎస్పీ ఏ. ఆర్. దామోదర్ ఆయనకు బుధవారం బ్రాంజ్ మెడల్ అందజేశారు. ఈ సందర్భంగా గుర్ల ఎస్సై పి. నారాయణరావు మాట్లాడుతూ, తమ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్‌కు రాష్ట్రస్థాయి పురస్కారం రావడం గర్వకారణమని తెలిపారు.