
మంతా తుఫాన్: తీరం దాటనున్న తీవ్ర గాలులతో భారీ వర్షం
గజపతినగరం ప్రాంతంలో మంగళవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మంతా తుఫాన్ ఈరోజు రాత్రి 11-12 గంటల సమయంలో తీరం దాటవచ్చని తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలియజేస్తోంది. తుఫాన్ తీరం దాటే సమయంలో 120 నుండి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరుతోంది. విపరీతమైన గాలులు 120 నుండి 150 కిలోమీటర్ల మధ్యలో వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు యంత్రాంగం హెచ్చరిస్తోంది.




































