టిడిపిలో చేరిన 50 కుటుంబాలు

3చూసినవారు
విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం పురిటిపెంట గ్రామానికి చెందిన 50 కుటుంబాలు వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆదివారం గజపతినగరంలోని టిడిపి కార్యాలయంలో నాయకులు వివి ప్రదీప్ కుమార్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. టిడిపి పోలీట్ బ్యూరో సభ్యురాలు గంటేడ శ్రీదేవి, ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్