దత్తిరాజేరు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఎం.జె.పి.ఏ.పీ.బీ.సీ.ఆర్. స్కూల్లో శుక్రవారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సులు నిర్వహించారు. డాక్టర్ తనీషా సుబ్బారాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, మానసిక వ్యాధులపై అవగాహన కల్పించడం, గ్రామాల్లో మానసిక రోగులను గుర్తించడం, ముందస్తు కౌన్సిలింగ్, చికిత్స ద్వారా నయం చేసుకోవచ్చని తెలిపారు. సరైన ఆహారం, శారీరక శ్రమతో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. స్కూలు పిల్లలకు చదువులో ఏకాగ్రత, ఆందోళన లేకుండా మంచి ఆలోచనలతో జీవితం సాగించాలని తెలియజేశారు.