ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం గజపతినగరం నియోజకవర్గంలోని దత్తి గ్రామానికి చేరుకున్నారు. సీఎం రాకతో గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లకు చేరుకొని సీఎం ని ఆహ్వానించారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సీఎం పర్యటనకు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన ఎన్టీఆర్ పింఛన్ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి ప్రజల నుంచి వినతులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటనతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.