విజయనగరం జిల్లా దత్తి రాజారు మండలం పెదకాద గ్రామంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు, చలికి తట్టుకోలేక సామి రెడ్డి పరదేశమ్మ (65), నింగి రెడ్డి లక్ష్మణ్ నాయుడు (63) మృతి చెందారు. అయితే, గ్రామంలో స్మశాన వాటికకు వెళ్లే దారి వాగు దాటి ఉండటంతో ఒకేసారి ఇద్దరు మృతి చెందడంతో అంత్యక్రియలు చేయడానికి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.