న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని ధర్నా

2చూసినవారు
న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని ధర్నా
న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ గురువారం ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్ల సంఘం విజయనగరం జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీనివాసుల నాయుడు ఆధ్వర్యంలో గజపతినగరం కోర్టు ఆవరణలో న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. ఈ చట్టం ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అమలులో ఉందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు లెంక రాంబాబు, కార్యదర్శి సాయి సురేష్ తో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్