బాపూజీ బాటలో పయనిద్దాం

0చూసినవారు
జాతిపిత మహాత్మా గాంధీ బాటలో అందరూ పయనించాలని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర డైరెక్టర్ పూసర్ల మోహన్ అన్నారు. శుక్రవారం గాంధీజీ జయంతి పురస్కరించుకొని గజపతినగరంలోని గాంధీ విగ్రహానికి మోహన్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్రం కోసం గాంధీజీ చేసిన సేవలను గుర్తు చేశారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గజపతినగరం మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు కేఏఎస్ఎస్ గుప్తా, వరద అప్పలరాజు, యూత్ అధ్యక్షుడు ఆరిశెట్టి భాస్కరరావు, ఆరిశెట్టి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్