విజయనగరం, గజపతినగరంలో స్థానిక శ్రీ గణేష్ విగ్రహం వద్ద న్యాయవాదుల సంఘం అధ్యక్షులు ఎల్. రాంబాబు ఆధ్వర్యంలో ఆదివారం ఓం, స్వస్తిక్, గణేష్ ఆకారం, శివలింగం ఆకారంలో దీపపు కాంతులు వెలిగించారు. ఈ దీపకాంతులు అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, జ్ఞానాన్ని నింపాలని, అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానం, బుద్ధి కలిగించాలని గణేష్‌ను కోరుకున్నారు. శాస్త్రీయంగా వెలిగే దీపం చుట్టుపక్కల వాతావరణాన్ని శుద్ధి చేస్తుందని, ఇంట్లో ఉన్న వారి శ్వాస మెరుగ్గా పనిచేస్తుందని రాంబాబు తెలిపారు.