జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా, గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పోలియో నిర్మూలనకు అందరూ సహకరించాలని, వైద్య సిబ్బంది సేవలను మంత్రి అభినందించారు.