రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పాచలవలసలో పలువురు రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల భూములకు భద్రత కల్పించేందుకు 12 రకాల సెక్యూరిటీ ఫీచర్లతో కూడిన పాస్ పుస్తకాలను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం రైతులకు భరోసా కల్పిస్తోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.