విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఇవాళ పీజీఆర్ఎస్ (పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ రెడ్రెసల్ సిస్టమ్) కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. ప్రజల సమస్యలు, అభ్యర్థనలు, ఫిర్యాదులను స్వీకరించి వాటికి పరిష్కారం చూపించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం కొనసాగుతుందని వివరించారు. అర్జీదారులు తమ వివరాలతో పాటు పాత అర్జీల స్లిప్పులు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.