గజపతినగరంలో ప్రైవేట్ ఉపాధ్యాయులకు సత్కారం

547చూసినవారు
గజపతినగరంలో ప్రైవేట్ ఉపాధ్యాయులకు సత్కారం
గజపతినగరంలోని సాయి సిద్ధార్థ కళాశాల వేదికగా పీస్ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యారంగంలో సేవలందిస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. వక్తలు మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ప్రైవేట్ ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సేవలను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ముఖ్య అతిధులుగా రెటైర్డ్ డిఈఓ అప్పలస్వామి, సంస్థ అధ్యక్షులు జి. సుధా రాణి, ఎం. చంద్రశేఖర్, న్యాయవాది పి. రుక్మిణీ, డీసీపీసీ సభ్యులు సుధా బ్రహ్మనాయుడు, ప్రైవేట్ ఉపాధ్యాయులు, విద్యాభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్