అమ్మ సేవా ఫౌండేషన్ కి శంకర్ ఫౌండేషన్ అవార్డులు

0చూసినవారు
అమ్మ సేవా ఫౌండేషన్ కి శంకర్ ఫౌండేషన్ అవార్డులు
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆత్మకూరి శంకర్‌రావు 95వ జన్మదినం సందర్భంగా విశాఖపట్నంలోని శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రిలో నిర్వహించిన ఫౌండర్స్ డే కార్యక్రమంలో దత్తిరాజేరు మండలం షికారుగంజి గ్రామానికి చెందిన అమ్మ సేవా ఫౌండేషన్ సభ్యులు కోన లక్ష్మణ, కోండ్రు దుర్గలను సత్కరించారు. మారుమూల గ్రామాల్లో శంకర్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరాలకు అమ్మ సేవా ఫౌండేషన్ అనేక సంవత్సరాలుగా సహాయ సహకారాలు అందిస్తోంది. ఈ సేవలను గుర్తించిన శంకర్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ కృష్ణకుమార్ వారి చేతుల మీదుగా అవార్డులు అందజేశారు.

సంబంధిత పోస్ట్