విజయనగరం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలీ..వ్యవసాయ కార్మిక సంఘం

678చూసినవారు
విజయనగరం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలీ..వ్యవసాయ కార్మిక సంఘం
విజయనగరం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని కోరుతూ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పురం అప్పారావు శుక్రవారం గజపతినగరం పంచాయతీ కార్యనిర్వహణ అధికారి శ్రీకాంత్ కు వినతి పత్రాన్ని అందజేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి కరువు నివారణ చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 200 రోజులు పని కల్పించి, రోజుకు 700 రూపాయలు వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు దేవుడు, రామారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్