విజయనగరం జిల్లా మెంటాడ మండలం చింతాడవలస గ్రామంలో పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసీ)
ఎన్నికలు రెండోసారి కూడా వాయిదా పడ్డాయి. ఎన్నికల నిర్వహణకు అవసరమైన కోరం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంఈఓ2 శివాజీ శనివారం తెలిపారు. తదుపరి తేదీని అధికారులు త్వరలో ప్రకటించనున్నారు. తల్లిదండ్రుల భాగస్వామ్యంతో
ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.