వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, కోర్టు కానిస్టేబుళ్ళు, కోర్టు మోనటరింగు అధికారులు, హెచ్ సి లు, కానిస్టేబుళ్ళుతో విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ శనివారం జూమ్ మీటింగు నిర్వహించారు. న్యాయస్థానాల్లో విధులు నిర్వహించాల్సిన తీరుపై ఎస్పీ దిశా నిర్దేశం చేశారు. ఎస్పీ మాట్లాడుతూ. న్యాయస్థానాల్లో కోర్టు కానిస్టేబుళ్లు కీలకమన్నారు.