
వైకుంఠ ఏకాదశి: జయతిలో శ్రీరాముల వారి భజన ఊరేగింపు
మెంటాడ మండలం జయతి గ్రామంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా శ్రీరాముల వారి భజన ఊరేగింపు ఘనంగా జరిగింది. గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో 'హరే రామ హరే కృష్ణ' అంటూ మహిళలు భజనలు చేస్తూ వీధుల్లో ఊరేగారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ భక్తిపూర్వక కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.







































