
చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి
నెల్లిమర్ల బైరెడ్డి వీధికి చెందిన గిడుతూరి అప్పలనారాయణ (70) రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతూ సోమవారం వేకువజామున మృతిచెందారు. ఈనెల 19న సాయంత్రం రోడ్డు దాటుతుండగా గుర్ల మండలానికి చెందిన వ్యక్తి నడుపుతున్న మోటార్‌సైకిల్ ఆయనను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అప్పలనారాయణను మొదట విజయనగరం ఆసుపత్రికి, అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. నెల్లిమర్ల పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







































