నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి థామస్ పేట మైదానానికి అనుకోని ఉన్న చంపావతి నది శనివారం నీటిమట్టం పెరిగి ఉదృతంగా ప్రవహిస్తున్నది. శుక్రవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం కారణంగా నదిలో నీటి ప్రవాహం పెరిగింది. నదిని తిలకించడానికి వచ్చిన నగరవాసులను, ముఖ్యంగా పిల్లలను నదిలో దిగవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. దసరా సెలవుల నేపథ్యంలో ఈ జాగ్రత్తలు తీసుకున్నారు.