విజయనగరం, నెల్లిమర్ల ప్రాంతాలలో అల్పపీడనం ప్రభావంతో చంపావతి నది గురువారం మధ్యాహ్నం ఉదృతంగా ప్రవహించింది. బుధవారం వరకు ఎడారిలా కనిపించిన నదిలో వర్షాల కారణంగా నీరు చేరి స్థానికులకు ఆనందాన్నిచ్చింది. అయితే, ఈ ప్రవాహంలో పరిసర ప్రాంతాల ప్రజలు దిగవద్దని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.