Dec 12, 2025, 17:12 IST/
భార్య ఓటమిని జీర్ణించుకోలేక టవర్ ఎక్కిన భర్త
Dec 12, 2025, 17:12 IST
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హర్యా తండాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలైన ఇండిపెండెంట్ అభ్యర్థి భర్త మాలోత్ రంగా, రిగ్గింగ్, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ గ్రామంలోని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. దాదాపు ఆరు గంటల పాటు కొనసాగిన ఈ ఆందోళనతో పోలీసులు, ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. విచారణ జరిపిస్తామని ఎమ్మార్వో హామీ ఇవ్వడంతో రంగా టవర్ దిగి వచ్చాడు.