సాదెం వెంకటరమణకు ఉత్తమ ప్రతిభ అవార్డు

1చూసినవారు
సాదెం వెంకటరమణకు ఉత్తమ ప్రతిభ అవార్డు
వంగర మండలం కొప్పరవలస గ్రామంలో స్పందన స్వచ్ఛంద సేవా సంస్థ 25 వసంతాలుగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో విశాఖపట్నంకి చెందిన శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి వెంకటరమణ సేవలను గుర్తించి బుధవారం ఉత్తమ ప్రతిభ అవార్డును ప్రధానం చేశారు. తన స్వస్థలమైన వంగర మండలం కొప్పరవలస గ్రామంలో గత 25 ఏళ్ల నుంచి గ్రామ ప్రజల దాతల సహకారంతో వృద్ధులకు, వితంతువులకు, అనాధలకు క్యారేజ్ ఉచిత బోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాదేం వెంకటరమణకు అవార్డు రావడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, మండల వాసులు, స్నేహితులు, బంధువులు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్