రాజాం మండలం గురువాంలో శనివారం ఎంపీడీవో ఆనందరావు ప్రతి ఇంటికి వెళ్లి మహిళలకు సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్‌పై అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని భారీగా తగ్గించిందని, దీనివల్ల అప్పటి ధరలతో పోలిస్తే ఇప్పటి ధరలు తగ్గాయని, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం సచివాలయాన్ని సందర్శించి, సిబ్బంది సమయపాలన పాటించాలని, బయటికి వెళ్లివచ్చేటప్పుడు మూమెంట్ రిజిస్టర్‌లో సంతకం చేయాలని ఆదేశించారు.