
లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే కోళ్ల
మొంథా తుఫాన్ నేపథ్యంలో, కొత్తవలస మండల కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలను శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మంగళవారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆమె కోరారు. ఈ పర్యటనలో కూటమి నాయకులు, నీటిపారుదల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.






































