
నకిలీ ఉద్యోగ ప్రకటనలను నమ్మవద్దు
విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న ప్రకటనలు నకిలీవని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. జీవన రాణి తెలిపారు. డీఎంహెచ్వో పేరుతో వస్తున్న ఈ ప్రకటనలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ప్రస్తుతం జిల్లాలో ఎటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయలేదని, అధికారిక ప్రకటనలు వస్తేనే విశ్వసించాలని స్పష్టం చేశారు.








































