శృంగవరపుకోట - Srungavarapukota

పంటల మార్పిడితోనే రైతులకు లాభాలు: అధికారులు

పంటల మార్పిడితోనే రైతులకు లాభాలు: అధికారులు

పిరిడి/కారాడ గ్రామాల్లో మంగళవారం 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో రైతులు సంప్రదాయ వరి సాగును వీడి, కూరగాయలు, అపరాలు, నువ్వుల సాగు వైపు మళ్లాలని అధికారులు పిలుపునిచ్చారు. ఏవో శ్యాంసుందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో పంటల సరళిలో మార్పుపై అవగాహన కల్పించారు. ఉద్యాన పంటలు వేసే రైతులకు కలెక్టర్ ఆదేశాల మేరకు బోరుబావుల సౌకర్యం కల్పిస్తామని, సాగు సమాచారం కోసం 'ఏపీ ఎయిమ్స్' యాప్‌ను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు ఉష త్రివేణి, ఐశ్వర్య, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

వీడియోలు


నిర్మల్ జిల్లా