
ఉప్పాడ తీరం వద్ద ఎగిసిపడుతున్న రాకాసి అలలు (వీడియో)
AP: మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో అలలు ఎగిసిపడుతున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో కెరటాల ఉధృతి మరింత పెరిగింది. కోనపాపపేట గ్రామంలో వందల ఇళ్లు సముద్ర కోతకి గురయ్యాయి. కొన్ని గృహాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఉపాధితో పాటు ఇళ్లని కూడా కోల్పోయామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే బీచ్ రోడ్డు ధ్వంసమైంది. దాంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయారు.




