విజయనగరం మండలం ముడిదాం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో స్పెషల్ ఆఫీసర్ Ch. శ్రీనివాస రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన సమస్యలైన డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, పలు అభివృద్ధి పనులపై ప్రజలతో సుదీర్ఘంగా చర్చించారు. గ్రామంలోని సమస్యలను సత్వరమే పరిష్కరించి, అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.