ప్రభుత్వాసుపత్రిని మెడికల్ కాలేజీ వద్దకు తరలించవద్దు.. ఎమ్మెస్ శ్రీనివాసరావు

2చూసినవారు
విజయనగరం ప్రభుత్వాసుపత్రిని పట్టణానికి దూరంగా ఉన్న మెడికల్ కాలేజీ వద్దకు తరలించే సన్నాహాలను ఆపాలని సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ  క్యాన్సర్ హాస్పిటల్ విజయనగరం జిల్లాకు రావడం శుభదాయకమని, అయితే దీనిని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పట్టణ మధ్యలో కాకుండా మెడికల్ కాలేజీ వద్ద ఏర్పాటు చేస్తే అన్ని విధాలా బాగుంటుందని ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్