ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాల్సిన ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల విధుల నిర్వహణలో ఉద్దేశపూర్వకంగా విధులను విస్మరించిన ఆరుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో రాజాం, సంతకవిటి, గరివిడి, వేపాడ, జామి మండలాలకు చెందిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు, ఇద్దరు మహిళా సంరక్షణ కార్యదర్శులు, ఒక ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఉన్నారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు.