విజయనగరం పట్టణ రోటరీ క్లబ్లో శనివారం జిల్లా స్థాయి బాలబాలికల యోగా పోటీలు జరిగాయి. ఈ పోటీలలో 85 మంది 8-14 ఏళ్ల వయసు బాలబాలికలు పాల్గొని ఆకట్టుకున్నారు. వివిధ విభాగాల్లో 17 మంది విజయం సాధించినట్లు యోగా జడ్జ్ ఎన్ పైడ్రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పిల్లలు, వారి తల్లిదండ్రులు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.