Mar 20, 2026, 17:03 IST/నిర్మల్
నిర్మల్
హ్యాట్రిక్ చీటింగ్ బడ్జెట్: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
Mar 20, 2026, 17:03 IST
రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ, 'ఇది హ్యాట్రిక్ చీటింగ్ బడ్జెట్. అప్పులు చెప్పని.. అప్పులు దాచే బడ్జెట్. ఇది మోసపూరితమైన బడ్జెట్. కేటాయించిన బడ్జెట్లో 75 శాతం కూడా ఖర్చు ఉండదు. ఈ బడ్జెట్ అప్పుల మీదనే ఆధారపడి ఉంది' అని విమర్శించారు. బడ్జెట్ కేటాయింపులు, ఖర్చుల తీరుపై ఆయన ఆరోపణలు చేశారు.