విజయనగరం జిల్లా బాడంగి పోలీస్ స్టేషన్ పరిధిలో 2024లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు వాడాడ వెంకటరమణ (23)కు విజయనగరం పోక్సో కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. శుక్రవారం వెలువడిన తీర్పులో రూ. 5 వేలు జరిమానా, బాధితురాలికి రూ. 5 లక్షల పరిహారం కూడా మంజూరు చేశారు. రాజేరు గ్రామానికి చెందిన మైనర్ బాలికను నమ్మించి లైంగిక దాడికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, నేరం రుజువుకావడంతో కోర్టు ఈ శిక్ష విధించింది.