చికిత్స పొందుతూ అంగన్వాడి టీచర్ బోను రవణమ్మ మృతి

0చూసినవారు
చికిత్స పొందుతూ అంగన్వాడి టీచర్ బోను రవణమ్మ మృతి
బొబ్బిలి పట్టణంలోని 13వ వార్డు, మహారాణిపేట-1 అంగన్వాడి కేంద్రంలో టీచర్‌గా పనిచేస్తున్న బోను రవణమ్మ అనారోగ్యంతో శుక్రవారం సాయంత్రం విజయనగరంలోని మహారాజా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు, సహోద్యోగులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చిన్నారుల సంక్షేమం కోసం ఆమె చేసిన సేవలను పలువురు స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఆమె మరణం అంగన్వాడి సిబ్బందిలో దిగ్భ్రాంతి కలిగించింది.

సంబంధిత పోస్ట్