మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బొబ్బిలి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అభ్యుదయం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ముగింపు సందర్భంగా శనివారం బొబ్బిలి రాజా కాలేజీ గ్రౌండ్ నుంచి 3 కిలోమీటర్ల వాక్-దాన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం భవ్య రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది. విద్యార్థులు, యువత, వాకర్స్, ప్రజలు, మీడియా ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇన్‌స్పెక్టర్ కె. సతీష్ కుమార్ తెలిపారు.