బొబ్బిలి మండలం పెంట గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న కార్మికులకు చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ప్రతినిధి ఎం. వెంకటరావు బాల్యవివాహ నిషేధ చట్టం-2006 గురించి అవగాహన కల్పించారు. 18 ఏళ్లలోపు అమ్మాయికి, 21 ఏళ్లలోపు అబ్బాయికి వివాహం చేస్తే జైలు శిక్ష, జరిమానాలు ఉంటాయని, మైనర్ వివాహాలకు ఫోక్సో చట్టం కింద కఠిన శిక్షలు ఉంటాయని, బాల కార్మికత్వం నేరమని హెచ్చరించారు. బాల హక్కుల ఉల్లంఘనపై 1098కు సమాచారం ఇవ్వాలని సూచించారు.